జలవనరుల కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు టిడిపి, జనసేన, సిపిఐ నాయకులు స్థానిక జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట గురువారం మిర్చి, పత్తి మొక్కలతో ధర్నా చేశారు. లకీëనారాయణ మాట్లాడుతూ కాల్వ చివరి భూములకు సాగునీరు అందించాలన్నారు. రైతుల గురించి జలవనరుల శాఖ మంత్రి మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోవటం లేదని విమర్శించారు. అనంతరం ఈఈ మురళీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నా నేపథ్యంలో కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ధర్నాలో బి.వెంకట అప్పారావు, ఎన్.వేణుగోపాల్, జె.విజరు కుమార్, జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










