Sep 14,2023 21:09

రైతులకు శిక్షణ ఇస్తున్న ఎడిఎ భాస్కరయ్య

సాగు ఖర్చులు తగ్గితేనే ఆదాయం : ఎడిఎ
తొట్టంబేడులో రైతులకు శిక్షణ
ప్రజాశక్తి - తొట్టంబేడు
సాగులో రైతులు అనవసర ఖర్చులు తగ్గిస్తేనే ఆదాయం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ఏ డి ఏ భాస్కరయ్య తెలిపారు. తొట్టంబేడు మండలం, పూడి గ్రామంలో, ఆత్మ సహకారంతో ఆయన రైతులకు శిక్షణ ఇచ్చారు. రైతులు వరిలో అధికంగా ఎరువులు వేసినా, పైరు అవసరమైన వరకే తీసుకొని, మిగతా వధాగా పోతుందని చెప్పారు. దీనివలన రైతుకు ఖర్చు తప్ప ఆదాయం పెరగదని తెలిపారు. రసాయన ఎరువులు, గుళికల మందులు, కలుపు మందులు అధికంగా వాడకం వలన భూమి జీవం కోల్పోతుందని చెప్పారు. శ్రీకాళహస్తి ఏ డి ఏ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ రబీకి రైతులకు అవసరమైన ఎరువులు ఆర్బికేల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం ఏఓ వేణుగోపాలరావు, ఇఫ్కో జిల్లా క్షేత్ర అధికారి మణి, మండల ఏఓ సురేంద్ర రెడ్డి, వ్యవసాయ సహాయకురాలు కవిత పాల్గొన్నారు.
రైతులకు శిక్షణ ఇస్తున్న ఎడిఎ భాస్కరయ్య