మేడికొండూరు: కౌలు రైతులందరూ సాగు ధ్రువీకరణ పత్రాలు పొం దాలని, అప్పుడే ప్రభుత్వం అందించే పలు రకాల పథకాలు వర్తి స్తాయని కౌలు రైతు సంఘం నాయకులు బొట్ల రామకృష్ణ అన్నారు. మండల కేంద్రమైన మేడికొండూరులో శుక్రవారం సాగు ధ్రువీకరణ పత్రాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు బోట్ల రామకష్ణ మాట్లాడుతూ కౌలు రైతులు ఈ సంవత్సరం వ్యవసాయ కౌలుసాగుదారులు ధ్రువీ కరణ పత్రం తీసుకోవాలని, వాటిని ఏ విధంగా తీసుకోవాలో సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేశారు. పూర్తిచేసిన ఫారాలను వీఆర్వో గాని ,రైతు భరోసాలో అధికారికి గానీ అందజేయాలని అన్నారు. సిసిఆర్సి కార్డు ఉంటేనే ప్రభుత్వ ఇచ్చే వ్యవ సాయము చేసే రైతుకు,రైతుభరోసా డబ్బులు గానీ, బ్యాంకు పంట రుణం ,పకతి నష్టపరిహారాలు గాని సాగు దారులకే వస్తాయని అన్నారు. ఎస్సీ కాలనీలోని కౌలు కమిటీ సభ్యులుగా పి.వీరయ్య, సిహెచ్ చిన్న శౌరిని ఎన్నుకున్నారు.










