Jul 05,2023 00:00

మాట్లాడుతున్న సిపిఎం సర్పంచ్‌ మొస్య

ప్రజాశక్తి-అనంతగిరి:సాగు భూములను వియనగరం రాజులకు ఇచ్చేది లేదని తీర్మానం చేశామని టోకురు సీపీఎం సర్పంచ్‌ కిల్లో. మొస్య అన్నారు. పంచాయతీ సచివాలయలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభను ఉద్దేశించి సర్పంచ్‌ మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి అధికారులు, సచివాలయ సిబ్బంది కృషి చేసిననాడే అబివృద్ది సద్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి నిధులు సకాలంలో విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే 15వ. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం టోకూరు పంచాయతీ బి కంబవలస, రాయవలస రెవెన్యూ పరిధిలోని గిరిజనులు సాగు భూమి విజయనగరం రాజులకు ఇవ్వ రాదని తీర్మానం చేశారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్క రవికుమార్‌, ఉప సర్పంచ్‌ గెమ్మెల నర్చన్న, మాజీ సర్పంచ్‌ సారా దొన్ను, వార్డు సభ్యులు పూజరి లక్ష్మణ్‌, గుజ్జెల. పద్మ, కొర్రా. పార్వతి, శిరగం. ప్రసాద్‌, చంద్రన్న, గిరి చైతన్య స్వచ్ఛంద సంస్థ కొరుబారికి. చందర్రావు, సీపీఎం సీనియర్‌ నాయకులు గెమ్మెల దేవన్న, నేచర్‌ ప్రతినిధి రాంబాబు, వాలంటీర్లు శాంతి, ప్రశాంతి, అప్పలస్వామి పాల్గొన్నారు.