Jul 23,2023 00:12

మాట్లాడుతున్న పెంటారావు

ప్రజాశక్తి-రోలుగుంట:జగనన్న రీ సర్వేలో దళితులు, గిరిజనుల సాగు భూములను స్థానికేతరులకు అప్పగిస్తే చూస్తే ఊరుకోమని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు, దళిత రత్న డాక్టర్‌ పాల్తేటి పెంటారావు హెచ్చ రించారు. శనివారం గిరిజనులు, దళితులు సాగులో ఉన్న భూములను పరిశీలించి రత్నంపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోలుగుంట మండలం రత్నంపేట పంచాయతీ పనసలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 2, 3, 4, 6, 8, 11లో 24 ఎకరాల్లో దళితులు, గిరిజనులు 50 మంది సాగు చేస్తున్నారన్నారు. సాగులో ఉన్న వారికే పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని నిబంధన ఉన్నా రెవిన్యూ అధికారులు, స్థానికేతలతో కుమ్మక్కై దళితులు గిరిజనుల సాగులో ఉన్న భూములను కొంత మందికి అప్పగించారన్నారు. తక్షణమే పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు రద్దు చేయాలని, లేకుంఏట జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ బహిరంగ సభలో దళిత సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నెక్కల నాగమణి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, దళిత సంఘం నాయకులు కిడారి మల్లేశ్వరరావు, దుర్గారావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.