ధర్నా చేస్తున్న గిరిజనులు, వ్యకాస నాయకులు
ప్రజాశక్తి-మక్కువ : మండలంలోని వెంకటబైరిపురం గ్రామ రెవెన్యూలో 24 గిరిజన కుటుంబాలు సాగు చేస్తున్న కొండ పోరంబోకు భూమికి పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఆధ్వర్యాన ఆ భూముల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ గిరిజనులు మూడేళ్లుగా సాగుచేస్తున్నారని తెలిపారు. దీనిపై తహశీల్దార్‌కు వినతి అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పిట్టల సీతారాం, నాయకులు చంటి, గిరిజనులు పాల్గొన్నారు.










