Jul 12,2023 21:34

ప్రజాశక్తి - చాట్రాయి
       జగన్నాధపురానికి చెందిన రైతులు తాము 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు సాగు హక్కులు కల్పించి, పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని, రైతు భరోసా వర్తింపచేయాలని డిమాండ్‌ చేస్తూ చాట్రాయి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏలూరు జిల్లా కార్యదర్శి డి.పుల్లారావు మాట్లాడుతూ సోమవరం రెవిన్యూ పరిధిలో ఆర్‌ఎస్‌ నెంబర్‌ 558/6లోని 40 ఎకరాల భూమిని 25 కుటుంబాల పేద రైతులు 70 సవత్సరాలుగా సాగు చేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. పేదలైన తాము సాగు చేస్తున్న భూములకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని హొచీకటి రామకృష్ణ, పానుగంటి రంగారావు అను రైతులు అన్నారు. ఒక భూస్వామికి 300 ఎకరాలకు జమిందారి పట్టా ఉంటే, 500ఎకరాలకు పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు హొజరిగాయని ఆరోపించారు. జగన్నాధపురం పేద రైతులు తమకు సాగు హక్కులు కల్పించాలని కోరుతూ గౌరవ హైకోర్టులో దావా వేసినట్లు దావా నెం.డబ్ల్యుపి నెంబర్‌ 3290/2023గా నమోదైందని పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీకటి రామకృష్ణ, పసుమర్తి సత్యనారాయణ, పానుగంటి రంగారావు, చిమట నాగమణి, పందిగల వీర వెంకటేశ్వరరావు, పేరమ్‌ సూరయ్య, సత్యవతి పాల్గొన్నారు.