
ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని పేరుపాలెం బీచ్ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ద్విచక్ర, ప్రత్యేక వాహనాల్లో బీచ్‌కు ఉదయమే చేరుకున్నారు. పలువురు సముద్ర కెరటాల్లో స్నానాలు చేశారు. చిన్నారులు ఇసుక తెన్నెలపై ఒడ్డుకు కొట్టుకొస్తున్న కెరటాలతో ఆటలాడుకున్నారు. ఒడ్డున ఉన్న ఆలయాలను దర్శించుకుని సరివే, కొబ్బరి తోటలో సహపంక్తి భోజనాలు చేసి సేద తీరారు.