బీచ్‌లో వ్యర్థాలను సేకరిస్తున్న విద్యార్థులు
ప్రజాశక్తి -మధురవాడ : ప్లాస్టిక్ ఫర్ చేంజ్ ఆధ్వర్యాన శనివారం సాగర్‌నగర్ బీచ్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. తీర ప్రాంతాలలో ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పిఎఫ్‌సి సోర్సింగ్ టీమ్ కె.జగదీష్, విశాఖ ఉమెన్స్ కాలేజీ డిగ్రీ విద్యార్థులు, బాలురు వసతి హాస్టల్ డిగ్రీ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఎల్.అర్జున్, ది బానియన్ సంస్థ ప్రతినిధులు ఎం.నిరుపమ సేకరించారు. ముందుగా ప్లాస్టిక్ ఫర్ చేంజ్ (పిఎఫ్‌సి) ఉద్దేశాన్ని ప్రోగ్రాం కో-ఆర్డినేటర్లు ఎస్.సత్యవేణి, సంతోషి వివరించారు. ఒక్కసారి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేస్తూ ప్రపంచ బ్రాండ్లు కలిగిన కంపెనీలు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన ప్లాస్టిక్‌ను సమాజానికి అందించుటలో పిఎఫ్‌సి సహకరిస్తుందని తెలియజేశారు.










