ప్రజాశక్తి -మధురవాడ : జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యాన నగరంలోని సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా సాగర్ నగర్ బీచ్‌లో క్లీనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 10వ విడత బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని సాగర్‌నగర్ వద్ద నిర్వహిస్తున్నామని, ఇప్పటికే విశాఖలో 9 విడతలుగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలను కొనసాగించామని చెప్పారు. సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖవేలీ స్కూల్, డైట్ విద్యార్థులు, ఫారెస్ట్, రెవెన్యూ, జివిఎంసి, ఎన్‌సిసి, విఎంఆర్‌డిఎ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










