ప్రజాశక్తి-మధురవాడ : సాగర్‌నగర్‌లో బీచ్‌లో హెచ్‌పిసిఎల్ ఆధ్వర్యాన మంగళవారం బీచ్ క్లీనింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌పిసిఎల్ సిఎమ్‌డి పుష్పకుమార్ మాట్లాడుతూ, సముద్రాలు ప్రాణదాతలుగా నిలుస్తాయన్నారు. మానవాళికి ప్రత్యక్షంగా ఆహారాన్ని, పరోక్షంగా ఆక్సిజన్‌ను పెద్దమెత్తంలో సముద్రాలు అందిస్తున్నాయన్నారు. సముద్రాలను సంరక్షించుకోవడం మానవ మనగడకు ఎంతో అవసరమన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. హెచ్‌పిసిఎల్ సంస్థ సాగర్‌నగర్ వద్ద తీరాన్ని దత్తత తీసుకుని తరచూ సాగరతీర స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు. హెచ్‌పిసిఎల్ సిజిఎం (హెచ్‌ఆర్) కె.నగేష్ మాట్లాడుతూ జివిఎంసి, జిల్లా కలెక్టర్ సహకారంతో సాగర్‌నగర్ తీరాన్ని దత్తత తీసుకున్నామని చెప్పారు. వారంలో రెండవ సారి మెగా బీచ్ క్లీనింగ్ డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపారు. హెచ్‌పిసిఎల్ ఉద్యోగులు, అధికారులు, స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు సాగరతీరంలో సుమారు వెయ్యి కిలోల వ్యర్థాలను ఏరి జివిఎంసి పారిశుధ్య విభాగానికి అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్ ఇడిలు వి.రతన్‌రాజ్, పి.వీరభద్రరావు, ఆర్.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భీమునిపట్నం : చిప్పాడ దివీస్ ఆధ్వర్యాన సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజులుగా స్థానిక బీచ్‌లో వ్యర్ధాలను సేకరించారు. అడాప్ట్ ఎ పార్షన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 19 కిలోల ప్లాస్టిక్, 46 కిలోల ఇతర వ్యర్ధాలు, 7 కిలోల గాజును సేకరించి జివిఎంసికి చెందిన క్లాప్ వాహనానికి మంగళవారం అందజేశారు. దివీస్ సిఎస్‌ఆర్ అధికారి సురేష్ కుమార్, శేఖరబాబు, పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు.










