Sep 22,2023 01:02

ప్రజాశక్తి - బాపట్ల
టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ చంద్రబాబుకు సంఘీభావంగా టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో పాండురంగాపురం సముద్రతీరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. టిడిపి రాష్ట్రకార్యదర్శి చింతకాయల విజయ్ నిర్వహణలో ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి సంఘీభావం తెలిపారు.