
ప్రజాశక్తి-పుల్లలచెరువు
మండలంలో మంచి నీటికి ప్రజలు కటకటలాడుతున్నారు. కానీ ముటుకుల నుంచి సాగర్ నీటిని పైపుల ద్వారా ప్రతి గ్రామానికి సప్లై చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాగర్ జలాలు గ్రామాలలో ప్రజలకు అవసరాన్ని బట్టి గ్రామాలకు వస్తున్నాయి. అయితే పుల్లలచెరువు నుంచి కవలకుంట్ల మీదుగా చాపలమడుగు వరకు సాగర్ నీటి పైపులు ఉన్నాయి. ఆ గ్రామాలకు నీరు సరఫరా అవుతుంది. కాగా వారం రోజుల నుంచి పుల్లలచెరువు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ఎదురు సాగర్ పైపు లీకేజ్ అయి నీరు వధాగా పోతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా చాపలమడుగు వరకు నీరు చేరడం లేదు. దీంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వారం రోజులు నుంచి సాగర్ జలాలు వృధాగా పోతున్నా పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని అరికట్టి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.