- 4 వేలకుగాను పూర్తయింది 24 గృహాలే
- డిసెంబరుకల్లా నిర్మాణాలు అనుమానమే
- ఇదీ నున్న మోడల్ లే అవుట్లో పరిస్థితి
ప్రజాశక్తి - విజయవాడ రూరల్ : ఎంతో ఆర్భాటంగా పేదలకు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు ఇళ్ల నిర్మాణాలకు పలుమార్లు శంకుస్థాపనలు చేసినా, ఇళ్ల నిర్మాణాలలో ఏమాత్రం పురోగతి కనిపించడంలేదు. ఉమ్మడి కష్ణాజిల్లాలోనే మోడల్ లే అవుట్గా ఉన్న విజయవాడ రూరల్ మండలం నున్న లే అవుట్లో ఇళ్ల నిర్మాణాల పరి స్థితి మరీ మందకొడిగా కొనసాగుతోంది. మండలంలోని గూడవల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, అంబాపురం గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది లబ్ధిదారులకు నున్న వికాస్ కాలేజీ రోడ్డులోని లే అవుట్లో ఇళ్లస్థలాలను పంపణీ చేశారు. ఆ తర్వాత సామూహికంగా శంకుస్థాపనలు చేశారు. ఏడాది క్రితం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటి వరకు కేవలం 24 నిర్మాణాలు మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. నున్న మోడల్ లే అవుట్లో మొత్తం 3,995 ఇళ్ల నిర్మాణాలకు గానూ 2,548 ఇళ్లు బిలో బేస్మెంట్ స్థాయిలో, 1,076 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో, 81 ఇళ్లు రూప్ లెవల్లో, 187 ఇళ్లు రూప్ కాస్ట్ లెవల్లో ఉన్నాయి. సాక్షాత్తు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చే యాలని లబ్దిదారులకు సూచించినా, సకా లంలో బిల్లులు మంజూరు కాకపోవడం, నిర్మాణ వ్యయం అధికంగా ఉండటంతో ఎక్కడ ఇళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఇదిలా వుండగా, ఇటీవల కురిసిన వర్షానికి కాల నీలోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. దీంతో నిర్మాణాలు మరింత మందగించాయి.
పెరిగిన అంచనా వ్యయం
గహ నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి అదనంగా రూ.35 వేలు రుణం మంజూరు చేయించారు. ఆ లెక్కన ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.80 లక్షలు, అదనపు రుణం రూ.35 వే లతో మొత్తం రూ.2.15 లక్షలు అవుతోంది. అయినప్పటికీ, నిర్మాణానికి రూ.6 లక్షల వ రకు ఖర్చవుతుండటంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలపై అంతగా దష్టి సారించడం లేదు. మరోవైపు కాలనీలో మౌలిక సదుపా యాల కల్పన అంతంత మాత్రంగానే ఉండ టంతో ఆ ప్రభావం ఇళ్ల నిర్మాణాలపై పడింది. నిధులు సకాలంలో మంజూరు చేయాలని, రుణ పరపతి పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.










