Nov 16,2023 18:40

మాట్లాడుతున్న మండల అధ్యక్షురాలు మేకల సుజాత

మాట్లాడుతున్న మండల అధ్యక్షురాలు మేకల సుజాత
సాధారణ సర్వసభ్య సమావేశం.
ప్రజాశక్తి-బిట్రగుంట:ుండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు మేకల సుజాత ఆధ్వర్యంలో ఎంపీడీఓ వెంకట సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు మేకల సుజాత మాట్లాడుతూ మండలంలో పెండింగ్‌లోని పనులను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. ఎంపీడీఓ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మండలంలోని తాగు నీరు, అభివద్ధి పనులపై మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్‌ మద్ది బోయిన వీర రఘు, మాల్యాద్రి, యువత నాయకులు మేకల శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షురాలు పద్మమ్మ, సర్పంచులు జేపీ గూడూరు సురేష్‌ గౌడ్‌ బోగోలు పి.అనిత, పిఎన్‌ఆర్‌ పేట గండూరి మంజుల ,మంగమూరు రావి సుప్రజా, అన్ని శాఖల అధికారులు , సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.