ప్రజాశక్తి - మంగళగిరి : పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా ఆల్మస్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మరోసారి పతకాలు సాధించారు. ఈనెల ఒకటో తేదీ నుండి కేరళలో నిర్వహిస్తున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 57 కిలోల విభాగంలో 3 బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించారు. స్క్వాట్ విభాగంలో 190 కిలోల బరువెత్తి బంగారు పతకం, బెంచ్‌ప్రెస్‌లో 77.5 కిలోలతో రజత పతకం, డెడ్‌లిఫ్ట్‌లో 160 కిలోలతో బంగారు పతకం, మొత్తంగా 427 కిలోలతో బంగారు పతకం సాధించారు. స్క్వాట్‌లో 190 కిలోల బరువును ఎత్తి ఆసియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో కొత్త రికార్డును నెలకొల్పి ఓవరాల్ బంగారు పతకం సాధించినట్లు కోచ్, తండ్రి షేక్ సందాని తెలిపారు. పతకాలు సాధించిన సాదియా ఆల్మస్‌ను రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, సూర్యనారాయణ, సకల కోటేశ్వర రావు, గుమ్మడి పుల్లేశ్వరరావు అభినందించారు.










