
ప్రజాశక్తి - బాపట్ల రూరల్
పట్టణంలోని మార్కెట్ వద్ద గల ముస్లిం సాది ఖానాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ కోన రఘుపతి మాట్లాడారు. పట్టణంలోని ముస్లిం షాదీ ఖానా నిర్వహణ బాధ్యతలు అంజుమన్ -ఏ - ఇస్లామియాకు అప్పగించినట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ముస్లిం షాధికానా కార్యనిర్వహణలో లేనందున దానిని ఆధునీకరణ చేయుటకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం కల్పిస్తానని అన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ద్వారా ప్రభుత్వం నుండి రూ.25లక్షలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. మున్సిపాలిటీ జనరల్ ఫండ్ ద్వారా మరో రూ.20లక్షల వచ్చే విధంగా చర్యలు చేపడతానని అన్నారు. షాధికాన ఆధుని కరణ నిమిత్తం తన వంతుగా రూ.5లక్షలు విరాళం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి నుండి ముస్లిం షాదిఖాన పూర్తి బాధ్యతలు అంజుమాన్ కమిటీ చూస్తుందని అన్నారు. ప్రభుత్వ, అంజుమన్ నిధులతో పాటు పట్టణంలోని ముస్లిం సోదరులు షాదీ ఖానా అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ప్రస్తుతానికి రెండు నెలలలోపు షాది ఖానాను ముస్లిం ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా అంజుమన్ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, వైసీపీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్, అంజుమన్ కమిటీ అధ్యక్షులు షేక్ జిలాని, పెద్ద మసీదు ప్రెసిడెంట్ రహీమ్ జానీ, న్యాయవాది జమురుద్ భాష, సయ్యద్ పిర్ పాల్గొన్నారు.