ప్రజాశక్తి-కె.కోటపాడు
మండల పరిషత్తు సర్వ సభ్య సమావేశంలో ఎంపిడిఒ కార్యాలయంలో శనివారం సాదాసీదాగా జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎటువంటి కొత్త ప్రతిపాదనలు ఆమోదించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గత సమావేశాల్లో ఆమోదించిన పనులపై ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ రవిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాదికి సామూహిక గృహ ప్రవేశాలు జరగాలని నిర్ణయించినందున గ్రామాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులందరూ జగనన్న గృహ నిర్మాణాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు బైరాగి, ఏవో సోమశేఖర్, ఐసిడిఎస్ ఏపీవో మంగతాయారు, వెలుగు ఏపిఎం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










