ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం సాదాసీదాగా జరిగింది. ఎంపీపీ డివి లలిత కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీం వివిధ అంశాలపై అధికారులను ప్రశ్నించారు. సాక్షాత్తు అధికార పార్టీ నాయకులే అద్దె చెల్లించలేదని తాళాలు వేయటం పార్టీకే అవమానం అన్నారు. అద్దె చెల్లిచే విధంగా తీర్మానం చేస్తే తానే అద్దె భవనాన్ని అప్పగిస్తానని సూచించారు. సచివాలయ భవనం నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 550సిమెంట్ కట్టలు ఏమయ్యాయని ఏఈ రామచంద్రావును ప్రశ్నించారు. ఈ విషయంపై ఏఈ సమాధానాన్ని దాటవేశారు. కౌలు రైతు గుర్తింపు కార్డుల సమాచారాన్ని సమగ్రంగా అందించాలని కోరారు. ఎంపీపీ మాట్లాడుతూ సభ్యులు అడిగే ప్రతి అంశానికి అధికారులు పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. అర్హత ఉండి సంక్షేమ పదకం అందని వాళ్లు మళ్లీ ధరకాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఉదయ భాస్కరి, మండల ఉపాధ్యక్షులు కె పిచ్చేశాస్త్రి, ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖర్, తాసిల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఎంఈఓలు పులిలాజర్, నీలం దేవరాజ్, ఏవో మీరయ్య, ఇరిగేషన్ ఏఈ రవిబాబు, డ్రైనేజీ ఏఈ సువర్చల పాల్గొన్నారు.










