Oct 14,2023 13:06
  • కౌలు రైతు సంఘం

ప్రజాశక్తి- నందిగామ : శనగపాడు సప్లయ్ ఛానల్ ద్వారా అనాసాగరం, నందిగామ గ్రామాల చివరి భూములకు వారబంధీ పద్దతిన సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చనుమెాలు సైదులు డిమాండ్ చేశారు. శనివారం నందిగామ, అనాసాగరం గ్రామాల పరిధిలోని శనగపాడు సప్లయ్ ఛానల్ కాలవలపై రైతు సంఘం నాయకులు పర్యటించారు. సాగునీరు కిందకు రావటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికి చివరి భూములకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శనగపాడు, వెంకటాపురం పరిధిలో 90కు పైగా మెాటార్లు పెట్టుకుని తడిసిన పోలాలకే పదే పదే సాగు నీరు పెట్టుకోవడం వల్ల అనాసాగరం, నందిగామ చివరి భూములకు సాగు నీరు రాక మాగాణి, పత్తి, మిర్చి పంటలకు ఎండిపోతున్నాయని, రైతులు యకరానికి 25 వేల నుండి 30 వేల రూపాయిల వరకు పెట్టు బడి పెట్టి నష్టపోతున్నారని, మిర్చి పంటలకు యకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పీకల్లోతు అప్పులలో కూరుకు పోయారని, ఇరిగేషన్ అదికారులు తక్షణమే స్పందించి ఎగువ న వున్న మెాటార్ల తొలగించి చివరి భూములకు సాగు నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు కర్రి వెంకటేశ్వరరావు, రైతు లు కనగాల వెంకటనారాయణ, కనగాల శ్రీను, గాది కొండ, పలువురు రైతులు పాల్గొన్నారు.