- లోక రక్షణ కోసం క్రైస్తవుల శాంతి ర్యాలీ
- ఉత్సాహంగా సాగిన రన్ ఫర్ జీసస్
ప్రజాశక్తి-పాడేరు:- గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల సందర్భంగా పాడేరు పట్టణంలో శనివారం ఉదయం క్రైస్తవ సోదరి సోదరులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సాహభరితంగా సాగిన ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని పాడేరు పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అంబేద్కర్ సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా సుండ్రు పుట్టు వరకు ఈ శాంతి ర్యాలీ జరిగింది. కారుణ్య చర్చ్ బిషప్ సిహెచ్ దైవ కృప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో యు సి వై ఎ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ జాన్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఏసుని నమ్ముకుని రక్షణ పొందుకోవాలని పిలుపునిచ్చారు. పాడేరు మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు డేవిడ్ రాజ్ మాట్లాడుతూ ఏసు ప్రభువు నిజమైన రక్షకుడని అన్నారు. బిషప్ దైవ కృప మాట్లాడుతూ ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రార్థన ర్యాలీ జరుగుతోందని ఈస్టర్ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్ అసోసియేషన్ ఫౌండర్ స్టీవెన్ రావు పట్టణంలోని వివిధ చర్చిల పాస్టర్లు జి తిమోతి వైవైరత్నం జాన్ ఫెడ్రిక్ ఇశ్రాయేలు అబ్రహం తో పాటు మహిళలు పిల్లలు క్రిస్టియన్ యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










