May 19,2022 16:06

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్‌ మూవీగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రంగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. రూ. 450 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్‌. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో మే 20 నుంచి అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రేక్షకులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అదేమిటంటే.. జీ 5 సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారు ఈ మూవీని ఉచితంగా చూడొచ్చు అని ట్విటర్‌ వేదికగా చిత్ర బృందం పేర్కొంది. గతంలో ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ. 100 చెల్లించాలని చిత్రయూనిట్‌ పేర్కొంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రేక్షకుల కోరిక మేరకు మార్చుకొని ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.