Jun 15,2023 15:10
  • సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి-విఆర్ పురం : ఈనెల 20 నుంచి నెల్లిపాకలో ప్రారంభమై విజయవాడ వరకు జరిగే 'పోలవరం పోరు' మహా పాదయాత్ర ఈనెల 24, 25, 26 తేదీలలో విఆర్ పురం మండలంలో కొనసాగుతుందని కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు ప్రజాసంఘాలు ఆదివాసి సంఘాలు మద్దతు తెలియజేసి పాదయాత్రను జయప్రదం చేయడానికి కృషి చేయాలని సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ సోయం.చిన్నబాబు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని నేటి వరకు మొదటి కాంటూర్ నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని ఇంకా వందల గ్రామాల నిర్వాసితులు నష్టపోతున్నారని కాబట్టి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. నిర్వాసితులందరూ ఈ యాత్రలో పాల్గొని మద్దతు తెలపాలని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు బీకర సూర్య ప్రకాష్ రావు, సుధాకర్, కో అప్సన్ సభ్యులు రహీం, ఆదివాసీ గిరిజనసంఘం జిల్లాకార్యదర్శి పులి.సంతోష్ కుమార్, మండల కార్యదర్శి పూనెం. ప్రదీప్ కుమార్, కుంజ.సుదీర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.