Jan 11,2023 16:53

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణములోని స్థానిక ఆరేటమ్మ ఆలయ సమీపంలో గల టీవీ9 ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ సుమంత్   తండ్రి కీర్తి శేషులు. సుబ్రహ్మణ్యం (91) అకాల మరణం చెందిన నందున వారి కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి  ఆర్ కే  రోజా. కుటుంబ సభ్యులతో కలసి పరామర్శించారు. మంత్రి వెంట ఈ కార్యక్రమంలో పుత్తూరు మునిసిపల్ చైర్మన్ ఏ హరి, వైస్ చైర్మన్, డి శంకర్, డీ జయ ప్రకాష్, కౌన్సిల్లర్లు, ఆలయ చైర్మన్ మనోహర్ రెడ్డి., కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.