Dec 18,2022 16:38

ప్రజాశక్తి-పుత్తూరు(తిరుపతి): రూరల్ మండలం రామకృష్ణాపురం పంచాయతీలోని కసింకుప్పం గ్రామంలో సర్పంచ్ విరిత, వైయస్సార్సీపి నాయకుడు దేవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సుమారు రూ.4 లక్షల మండల నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సహకారంతో పంచాయతీలోని గొల్లపల్లి దళితవాడ, కసింకుప్పం ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణంతోపాటు మురుగునీటి కాలువల పనులు చేపడుతున్నారు. పనులను పంచాయతీ కార్యదర్శి ముని నరేష్ కుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనుదీప్ తదితరులు పనులను పర్యవేక్షించారు.