ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు: గత 30 ఏళ్లుగా రోడ్డుకోసం చిన్నగొట్టిగల్లు కొత్త కాలనీ కాలనీవాసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.సర్పంచ్ మనోహర్,స్థానిక నాయకులు,కాలనీవాసులతో కలిసి ఎంపిపీ యుగందర్ రెడ్డి రోడ్డు విషయమై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విన్నవించారు. స్పదించిన ఎమ్మెల్యే 38 లక్షల తుడా నిధులతో తో బీటీ రోడ్డు నిర్మాణ పనులుకు అనుమతి మంజూరు చేయించారు. మంజూరైన కాలనీకి డ్రైనేజీ,బిటీ రోడ్డు పనులను ఎంపిపి యుగందర్ రెడ్డి ప్రారంబించారు. కాలనీ వాసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభంకావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కి, ఎంపిపీకి, సర్పంచ్ కు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.










