Oct 11,2023 13:12

ప్రజాశక్తి - ఓజిలి: ఓజిలి మండలం రాజుపాలెం జాతీయ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. చిల్లకూరు మండలంలోని పిడతల పూడి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన సొంత పనుల నిమిత్తం ఓజిలికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది.