Sep 28,2023 13:43

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక పుత్తూరు చెన్నై జాతీయ రహదారిపై నారాయణవనం రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన లారీ, కారును ఢీ కొనడంతో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులు ఎటువంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు దగ్గర స్పీడ్ బ్రేకర్ భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో యాక్సిడెంట్ తగ్గించవచ్చని స్థానిక ప్రజలు ప్రయాణికులు గుసగుసలాడుతున్నారు.