Oct 09,2023 11:11

ప్రజాశక్తి-వల్లూరు : కడప తాడిపత్రి జాతీయ రహదారి తోల గంగన్నపల్లి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. సోమవారం తోలగంగనపల్లి వద్ద కడప నుండి వస్తున్న ద్విచక్ర వాహనం వల్లూరు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నలగరు కింద పడడంతో చెన్నై నుంచి తాడిపత్రి కి వెళ్తున్న లారీ కిందపడిన వ్యక్తులపై ఎక్కడంతో ఇద్దరి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను కడప రిమ్స్ తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.