ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి పథకంతో ఆర్థిక భరోసా కల్పించారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. పుత్తూరులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులను బుధవారం పంపిణి చేశారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏ రాష్ట్రానికి వెళ్లినా మీకు లాంటి ముఖ్యమంత్రి మాకు లేరే అని బాధపడుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్న తీరు చూస్తే మీపై ఎంత అభిమానం ఉందొ అర్థమవుతుందని అన్నారు. సరైన ఆహారం లేకుండా వున్నారని పిల్లల కోసం జగనన్న స్వయంగా జగనన్న గోరుముద్ద మెనూ రూపొందించారని తెలిపారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రిగా ఉండడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ విద్యా కంటెంట్ తో ట్యాబులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులు మొత్తం 5,18,740 మందికి ట్యాబు ల విలువ 688 కోట్లు మరియు బైజూస్ ఫ్రీ లోడెడ్ కంటెంట్ విలువ 778 కోట్లు మొత్తం 1,466 కోట్ల రూపాయలు వినియోగించినట్లు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్కారణలకోసం గత మూడున్నర సంవత్సరాలలో వైస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడీ 44.49 లక్షల మందికి 19,617 కోట్లు, జగనన్న విద్యాదీవెన 24.75 లక్షలమందికి 9,051 కోట్లు, జగనన్న వసతి దీవెన 18.78 లక్షల మందికి 3,349 కోట్లు, జగనన్న విద్యాకానుక 47.72 లక్షల మందికి 2,368 కోట్లు, ట్యాబుల పంపిణి 5.18 లక్షల మందికి 688 కోట్లు, జగనన్న గోరుముద్ద 43.26 లక్షల మందికి 3,239 కోట్లు, నాడునేడు మొదటి దశ 15,634 స్కూల్స్ 3,669 కోట్లు,రెండవ దశ 22,344 విద్యా సంస్థలు 8,000 కోట్లు, వైస్సార్ సంపూర్ణ పోషణ 34.19 లక్షల మందికి 4,895 కోట్లు, స్వేచ్చా సానిటరీ నాపకిన్స్.10.01 లక్షల మందికి 32 కోట్లు మొత్తం 54,910 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి వి శేఖర్, ఉప విద్యాశాఖాధికారి రఘురామయ్య, మునిసిపల్ చైర్మన్, ఏ హరి. వైస్ చైర్మన్ లు డి శంకర్.డి జయ ప్రకాష్. ఎంపీపీ, వైస్ ఎంపీపీలు,కౌన్సిల్లర్లు, వనిత కార్తీక్. ఎంపిటీసీలు, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీల చైర్మన్లు, మనోహర్ రెడ్డి. ఎంపీడీఓ, ఇందిరమ్మ. మున్సిపల్ కమిషనర్ కేఎల్ ఎంఎన్ రెడ్డి. మండల విద్యాశాఖధికారి, తిరుమల రాజు. ప్రిన్సిపాల్, రఘుపతి. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు, తల్లి తండ్రులు, విద్యార్థులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. .










