Jul 08,2023 15:03
  • ఎన్నో కోట్ల మంది గుండెల్లో మారుమోగే గుండె చప్పుడు  "వైయస్సార్  

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : వైయస్సార్ అంటే ఒక పేరు కాదు.ఒక బ్రాండ్ అని ఎన్నో కోట్ల మంది గుండెల్లో మారుమోగే గుండె చప్పుడు వైయస్సార్" అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి  ఆర్.కె.రోజా  తెలిపారు. మహానేత  వైఎస్. రాజశేఖర్ రెడ్డి.74వ జయంతిని.పురస్కరించుకొని పుత్తూరు జెడ్.పి.బాలికల హైస్కూల్ లో శనివారం జరిగిన మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన సందర్బంగా సమావేశంలో మంత్రి  ప్రసంగించారు.  మాట్లాడుతూ స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  రాష్ట్రంలో ప్రజలకు ఎనలేని సేవలు చేసారని కొనియాడారు. మన కోసం ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన వైఎస్ఆర్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అనిపిస్తుందని అన్నారు. తెలుగు వాళ్ళ కోసం పుట్టిన మానవాతీత శక్తి అని, ఎందుకంటే ప్రతి కుటుంబం కష్టాలు తీర్చాలని, ఎలా వారికి ఆర్థికంగా భరోసా కల్పించాలని, ఎలా పిల్లలు చక్కటి చదువులు చదువుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలి అని అనేక సంక్షేమ పథకాలను ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు తమ కుటుంబ సభ్యులు సీఎం అయితే, ఆ విధంగా ఆయన అందరి కోసం చేసారని తెలిపారు. వైస్సార్ డాక్టర్ గా ఒక్క రూపాయికే వైద్యం చేసిన సంగతి మనందరికీ తెలుసని, సీఎం కాకముందు పేదవాడికి ఒక జబ్బు వస్తే ఎలా తల్లడిల్లిపోతాడు అని అర్థమైంది కాబట్టే తాను ముఖ్యమంత్రి కాగానే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి, ఈ రోజు గుండె ఆపరేషన్ నుంచి పెద్దపెద్ద వ్యాధులకు కూడా ప్రభుత్వమే దగ్గరుండి వారికి ఫ్రీగా వైద్యాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాడు కాబట్టే ఈ రోజు దేశమంతా కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ల ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నారని వివరించారు.వైయస్సార్ గారే కాదు ఆయన పాలన కూడా దమ్మున్న పాలనే, ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆ తర్వాత వచ్చిన కదిలిస్తే ప్రజలు తరిమి కొడతారు అనే భయం వల్ల కూడా... అంత అద్భుతమైన.తీసుకొచ్చాడని, వాటి వల్ల ఎంతో మంది జీవితాలు నిలబడ్డాయని అలాంటి వైయస్సార్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన వైద్య వృత్తి కాబట్టి మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తండ్రి రెండు అడుగులు ముందుకు వేస్తే కొడుకు నాలుగు అడుగులు ముందుకు వేస్తారని ఎలక్షన్స్ ముందు చెప్పాను కానీ 400 అడుగు ముందుకేశారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారని వివరించారు. అంతే కాకుండా ఈరోజు పుత్తూరు అర్బన్ లో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రారంభించామని, నగరి లో  అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా రెండు ఓపెన్ చేసే స్టేజ్లో ఉందని తెలిపారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా చిన్న వాటికి కూడా  ఇంటికి డాక్టర్ వెళ్లి చూస్తే కార్యక్రమం "ఫ్యామిలీ డాక్టర్" పథకం తో ఇంటికి వెళ్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇప్పుడు హైదరాబాద్ చెన్నై తమిళనాడు కర్ణాటక పెద్ద హాస్పిటల్ లో కూడా ఆరోగ్యశ్రీలో వర్తింప చేసే ఈ రోజు ప్రజలను కాపాడుకుంటున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారని అన్నారు. మహనీయుడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆయన ఏమైనా చేయాలనుకుని మిగిలిపోయినవన్నీ నేను చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు పావురాళ్ళ గుట్ట వద్ద ప్రమాణం చేశారు. ప్రాణాలు.తీయాలనుకున్నారని, తప్పు చేయకున్నా జైల్లో పెట్టారని కానీ అన్ని భరించి తండ్రి కోసం త్యాగం చేసిన ఏకైక కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి కాకుండా ఆయన లేకుండా కూడా అదే కంటిన్యూ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ రోజు మనమందరం కూడా రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన రోజు అన్నారు. ఆయన ఏదైతే కోరుకున్నాడు ఆ విధంగా ప్రజలకు మనందరం కూడా ప్రజాప్రతినిధులు సర్వీస్ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మధుసూదన్ రెడ్డి, మంత్రి భర్త ఆర్కే సెల్వమణి. పుత్తూరు మునిసిపల్ చైర్మన్, ఏ హరి, వైస్ చైర్మన్లు, డీ జయ ప్రకాష్, డి శంకర్, కౌన్సిలర్లు,  సీ 16 అవార్డు కౌన్సిలర్ వనిత సికే కార్తికేర్, ఎంపీపీ మునివేలమ్మ, భాను మతి చక్రి,  ఈఓ, డాక్టర్లు, రాష్ట్ర డైరెక్టర్ లు కమిటీ చైర్మన్లు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.