ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : నిరుపేదల గృహాలకు. ఉచితంగా సిమెంటు మంత్రి ఆర్.కె.రోజా పంపిణీ చేశారు. వనమాల పేట మండలం బట్టి కండిగ గ్రామంలో ఏఎం పురం గ్రామంకు చెందిన 25 నిరుపేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా 700 సిమెంటు బస్తాలు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా పంపిణీ చేశారు. పుత్తూరు రూరల్ మండలం తిరుమల కుప్పం సచివాలయం పరిధిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో 20 లక్షల రూపాయల మరియు 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్స్ తో మంజూరైనా డ్రైనేజ్ మరియు సిమెంట్ రోడ్ల మరియు పైపులైన్ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అన్న రాంప్రసాద్ రెడ్డి.. వడమాలపేట ఎంపీపీ, విజయలక్ష్మి.. పుత్తూరు ఎంపీపీ మునివేలమ్మ. వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు పాల్గొన్నారు.










