Jan 28,2023 16:09
  • సిఎస్ కేఎస్. జవహర్ రెడ్డి 

ప్రజాశక్తి - క్యాంపస్ : వైద్య రంగంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యత ఉందని, జిల్లా అధికారులు, స్విమ్స్, టాటా కాన్సర్ ఆసుపత్రులు సంయుక్తంగా ప్రణాళికా బద్దంగా కాన్సర్ నివారణ, వైద్య చికిత్సలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి సూచించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతీ అతిధి గృహంలో ఎస్.వి. ఆయుర్వేద , స్విమ్స్, టాటా కాన్సర్ ఇన్స్టిట్యూట్  (స్వికార్), పద్మావతీ చిన్న పిల్లల హృదయాలయ ఆసుపత్రుల డాక్టర్లు,అధికారులతో తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లలు   కె.వెంకటరమణా రెడ్డి, ఎం.హరినారాయణన్ లతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో వైద్యశాలలు, విద్యాలయాలు విశాఖతో సమానంగా అత్యధికంగా ఉన్నాయని , ఖర్చులతో కూడిన కాన్సర్ నివారణ, చికిత్సకు ప్రాధాన్యమిచ్చే  విధంగా సమన్వయముతో పనిచేయాలని అన్నారు.  ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం అందులో ఎ.ఎన్.ఎం., ఎం.డి.హెచ్ మరో ఎ.ఎన్.ఎం. లు అందుబాటులో ఉన్నారని, వీరి సహాయంతో ఆసుపత్రుల క్యాంపుల నిర్వాహణ “ సహకరించండి – తెలపండి “ అనే నినాదంతో కాన్సర్ పేషంట్ల గుర్తింపు జరగాలని, ప్రథమ స్థాయిలో నివారించగలిగితే ప్రాణ రక్షణ, ఆర్ధిక భారం తగ్గించిన వారమవుతామని అన్నారు. ఎస్.వి. ఆయుర్వేద వైద్య శాల ఆద్వర్యంలో 63 రకాల మందులు నరసింగాపురం వద్ద ప్రారంభించడానికి  సిద్ధమవ్వడం శుభసూచకమని అన్నారు.  సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం, కేరళ స్థాయికి తిరుపతి చేరే విధంగా కాన్సర్ నివారణ కు రూపుదిద్దుకోనున్నదని అన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి సి.ఎం.సి. ఆసుపత్రి వారిని కూడా భాగస్వాములు చేయాల్సి ఉంటుందని అన్నారు.    స్విమ్స్, టాటా కాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు చేపడుతున్న మెడికల్ క్యాంపులు అందిస్తున్న వైద్య సేవలు సి.ఎస్. కు వివరించారు. క్యాన్సర్ కణాలు గుర్తించి వాటి దుష్పలితాల పై అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటివరకు  పింక్ బస్సులు స్విమ్స్, టాటా మహిళలలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రణాలికాబద్దంగా సచివాలయ స్థాయి నుండి స్కానింగ్ పరిశీలించారని అన్నారు. రీ సెర్చ్ విద్యాలయాలు ఐ.ఐ.టీ, ఐసర్  సహాకారం తీసుకుని పైలెట్ ప్రాజెక్టు గా చేపట్టనున్న ఈ విధానం మరో 10 రోజుల్లో రూపుదిద్దుకోవాలని అన్నారు.  రాష్ట్రంలో ప్రారంభంకానున్న  కొత్త 23 మెడికల్  కళాశాలల్లో ఆంకాలజీ తప్పనిసరి చేయాలని సి.ఎం. ఆదేశించారని అన్నారు.    ఈ కార్యక్రమంలో స్విమ్స్ డా.జయచంద్రా రెడ్డి, డా.రామ్, స్వికార్ డా.నాగేశ్వర రెడ్డి, చిన్నపిల్లల ఆసుపత్రి డా.శ్రీనాథ రెడ్డి, ఎస్.వి. ఆయుర్వేదిక్ వైద్య శాల సూపరింటెండెంట్ రేణు దీక్షిత, ఆర్డీఓ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.