ప్రజాశక్తి-నార్పల : రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో నార్పల మండలం కేంద్రంలోని పాఠశాలలతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రైవేట్ పాఠశాలలను గత వారం రోజుల నుండి మండల విద్యాశాఖ అధికారులు కృష్ణయ్య, నారపరెడ్డిలు మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నార్పల మండలానికి అయినా రావచ్చునని అందువలన పాఠశాలల్లో అన్ని రికార్డులు, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన మెనూ తదితర వాటి గురించి సూచనలు చేస్తూ వచ్చారు. మొత్తానికి ప్రిన్సిపాల్ సెక్రటరీ నార్పల మండలానికి వస్తారో రారో గాని మండలంలో పలు పాఠశాలల్లో మరుగున పడిన చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని పలువురు గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










