
హైదరాబాద్ : ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగించబోతున్నామని తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌పై పోరాటం చేసేందుకు తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కెసిఆర్ ఏడున్నరేళ్ల పాలనలో దళితులు, గిరిజనులకు జరిగిన మోసాలను ఎండగట్టేందుకే ఈ దళిత దండోరా సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు (9వ తేదిన) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు.