- ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నత విద్యాసంస్థల్లో వికలాంగ విద్యార్ధులకు ఐదుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదివారం జివో 27ను విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఐదు శాతం కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రవేశాలకుగరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించింది. వికలాంగుల సంపూర్ణ సాధికారతకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి కెవి ఉషశ్రీచరణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాన అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించాలని, సమాజంలో వారికి పూర్తి భాగస్వామ్యం కల్పించేందుకు విద్యావకాశాలు మెరుగు పరచాల్సి ఉందనిసిఎం జగన్ నమ్మారనిపేర్కొనాురు. అందులో భాగంగానే రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు. వికలాంగులు విద్యను పొందేందుకు ఆలస్యమ్యే అవకాశం ఉందని అందుకోసం విద్యాసంస్థల్లో ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలింపు ఇచ్చామని పేర్కొన్నారు.










