Jul 31,2021 11:53

అమరావతి : బంగారం అంటే ఇష్టపడని వారుండరు.. ఎంత రేటు పెరుగుతున్నా కానీ బంగారం కొనుగోలు మాత్రం ఎప్పుడూ ఆగదు. బంగారానికున్న డిమాండ్‌ అలాంటిది మరి. ఇప్పటివరకు లోహంతోనే బంగారం తయారయింది. అదే నీటితో బంగారం తయారయితే..! అవునండీ.. బంగారాన్ని నీటి బిందువుతో కూడా తయారు చేసుకోవచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలే ఇప్పటికే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. సేవ్‌ వాటర్‌ అంటూ ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నారు. రాష్ట్రాల మధ్య కూడా జలవివాదాలు రాజుకుంటున్నాయి. ఇక నీరు కాస్తా బంగారమయితే.. భవిష్యత్‌లో సామాన్యుడి పరిస్థితేంటి ?

నీటిని లోహంగా మార్చవచ్చు : చెక్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు
నిజానికి నీరు అనేది లోహం కాదు. లోహాలు కాని చాలా వస్తువులను ఇప్పుడు లోహాలుగా మార్చి చూపించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రేగ్‌ లోని చెక్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ... నీటిని బంగారంగా మార్చే ప్రక్రియలో అన్నిటికంటే ముఖ్యమైనది 'టైమింగ్‌' అన్నారు. వస్తువులోని అణువులు, పరమాణువులను అన్నిటిని గ్యాప్‌ లేకుండా ఒక్కచోటకుచేర్చితే ఆ వస్తువు లోహంగా మారి, దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్ల సమూహం ఆ సమయంలో విద్యుత్‌ వాహకాలుగా పనిచేస్తాయని తెలిపారు. ఇలా నీటిని లోహంగా మార్చడానికి సుమారు కోటిన్నర అట్మాస్ఫియర్స్‌ పీడనం అవసరమని చెప్పారు. అయితే అంత మొత్తంలో పీడనం అవసరం లేకుండానే నీటిని లోహంగా మార్చవచ్చునని చెక్‌ అకాడమీ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు వివరించారు.

పేలుళ్లు జరిగే ప్రమాదముంది..
ఈ ప్రక్రియలో పేలుళ్లు జరిగే అవకాశముందని, చాలా జాగ్రత్తలను పాటించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని క్షార లోహాల నుంచి ఎలక్ట్రాన్‌ లను తీసుకుని వాటిని నీటిపై ప్రయోగిస్తే చాలంటున్నారు. మూలకాల మధ్య చర్య జరిపే విషయంలో చాలా నెమ్మదిగా ప్రాసెస్‌ చేస్తారు. ఒక సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకుని దానిని ఓ వాక్యూమ్‌ చాంబర్‌ లో పెట్టి ఆ సిరంజీ నుంచి మెల్లగా సోడియం, పొటాషియం ద్రావణం బిందువులను విడుదల చేసి నీటి ఆవిరితో చర్య జరిపేలా చేస్తారు. ఇలాంటి చర్యలో కొన్ని క్షణాల పాటు నీటి బిందువు బంగారంగా మరి అనంతరం మెరిసేలోగా బంగారంగా తయారవుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే మండే మృదు స్వభావం ఉన్న మూలకాలకు నీటి చుక్క తగిలితే పేళ్ళుల్లు జరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.