ప్రజాశక్తి-వెదురుకుప్పం : వెదురుకుప్పం మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు లు జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వెదురుకుప్ప మండలానికి వచ్చారు. వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని , వెదురుకుప్పం పంచాయతీ కాంప్లెక్స్ మరుగుదొడ్డి మధ్యలో ఆక్రమ షెడ్డు తొలగించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసలు కి తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి పి.మోహన్ మురళి వినతి పత్రం ఇచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కారం చూపాల్సిన బాధ్యత రెవెన్యూ వారిదే అని ఆయన మీడియాకు చెప్పారు.










