Jun 12,2023 16:39
  • తిరుపతి కలెక్టర్ కి ఏపీయూడబ్ల్యూజే వినతి

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లలకు అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఫీజులో 50% రాయితీ కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డికి సోమవారం ఉదయం వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలలో 50% రాయితీ ఇస్తున్నారని, నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో ఈ రాయితీని కొనసాగించాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి డిఇఓ, ఆర్ ఐ ఓ లు వెంటనే ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించారు. జర్నలిస్టుల పట్ల ఎప్పుడు సానుకూలంగా స్పందిస్తున్న కలెక్టర్ వెంకటరమణారెడ్డికి యూనియన్ నేతలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, రాధాకృష్ణ, ముని రామిరెడ్డి,  రాధాకృష్ణ, మస్తాన్,  కేశవులు, రవి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.