- మాజీ ఎంపీపీ కారం శిరమయ్యకి పార్టీ శ్రేణులు ఘన నివాళులు
ప్రజాశక్తి-వి అర్ పురం : వి ఆర్ పురం మాజీ ఎంపీపీ సిపిఎం ఉద్యమ నేత శిరమయ్య 2వ వర్ధంతిని అమర జీవి స్వగ్రామం మండలంలోని చిన్నమట్టపల్లి ఆయన స్మారక స్థూపం వద్ద జరిగింది. పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి వారికి విప్లవ జోహార్లు నివాళులు అర్పించారు. స్మారక స్తూపం వద్ద ఏర్పాటు చేసిన సిపిఎం జెండాను ఎంపిపి కారం లక్ష్మి ఎగుర వేశారు. అమర జీవి స్మారక స్థూపం వద్ద అమర జీవి శిరమయ్య చిత్ర పటానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూనేం సత్యనారాయణ వారి సతీమణి ముత్తమ్మ స్మారక స్థూపానికి పార్టీ మండల కార్యదర్శి సోయం. చిన్న బాబు నివాళులు అర్పించారు తదుపరి వారు మాట్లాడుతూ మండలంలోని పోరాటాలతో చాలా అభివృద్ధి పనులు సాధించారని వారి ఆశయాలను సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుంజా నాగిరెడ్డి, బంకు. సత్తిబాబు, వడ్లది. రమేష్ గుండుపూడి, లక్ష్మణరావు ప్రకాష్ రావు, సత్యనారాయణ, అచ్యుతరావు సోడి నాగేశ్వరరావు, పండ. వెంకటేశ్వర్లు, రాములమ్మ, లీలావతి, కనకమహాలక్ష్మి, గ్రామ సిపిఎం శాఖ సభ్యులు గ్రామ మహిళలు కార్యకర్తలు పాల్గన్నారు.










