Mar 26,2023 16:47

ప్రజాశక్తి-పాపవినాశం : తిరుమల పాపవినాశం పరిధిలో 16ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో ఆర్ఐ కే.సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ టీమ్ శనివారం తిరుమల రేంజ్ పాపవినాశం నుంచి కూంబింగ్ చేపట్టింది. తుంబురుతీర్థం నిషేధిత అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని గుర్తించి పైప్రాంతం నుంచి కిందికి దిగుతూ రావడాన్ని స్మగ్లర్లు గమనించారు. వెంటనే దుంగలు పడేసి పారి పోయారు. ఆ ప్రాంతంలో 16 ఎర్రచందనం దుంగలు లభించాయి. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. దుంగలను స్వాధీనం చేసుకుని, తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఐ బాలకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.