Aug 23,2023 22:10

ఫొటో : విద్యార్థులకు బోధిస్తున్న ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు

ర్యాంకులు సాధించేలా బోధించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో విద్యార్థులు జిల్లా ర్యాంకులు సాధించేలా బోధన అందించాలని ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని జిల్లా ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్‌ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో జిల్లా ర్యాంకులు సాధించడమే ధ్యేయంగా నాణ్యమైన బోధన విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
గ్రీన్‌ చాక్‌ బోర్డ్‌పై గణితంలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నైపుణ్యాలను పరిశీలిస్తూ పదవ తరగతి గణితశాస్త్రంలోని మెలకువలను విద్యార్థులకు వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూస్తూ తమసొంత పిల్లలకు ఇంటి వద్ద ఎంత రుచి, శుచికరంగా భోజనం తయారు చేస్తామో అంతకంటే ఎక్కువగా విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందివ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు షహనాజ్‌ బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.