Aug 08,2023 21:45

ఫొటో : మాట్లాడుతున్న జెఎసి నాయకుడు కాకు వెంకటయ్య

ర్యాలీ విజయవంతానికి పిలుపు
ప్రజాశక్తి-ఉదయగిరి : మణిపూర్లో జరుగుతున్న విధ్వంసకాండను నిరసిస్తూ బుధవారం ఉదయగిరిలో సమైక్య క్రైస్తవ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సంఘీబావ శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని జెఎసి నాయకుడు కాకు వెంకటయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో శాంతి ర్యాలీ నిర్వహణపై జెఎసి కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు మూడు నెలలుగా మణిపూర్లో జరుగుతున్న క్రూరమైన సంఘటనలు బాధాకరమన్నారు.
క్రైస్తవులపై దాడులు చేసినా, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని మణిహీర్లో శాంతికోసం చర్యలు చేపట్టాలన్నారు. ఈ సంఘీభావ శాంతి ర్యాలీలో అధిక సంఖ్యలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు దస్తగిరి అహ్మద్‌, రియాజ్‌, ఎస్దాని, పంషీర్‌, అబ్రహం, ఆరోన్‌ నాయబ్‌, కోడె రమణయ్య పాల్గొన్నారు.