మాట్లాడుతున్న చంద్రమౌళీశ్వరి
ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : ప్రొఫెషనల్ కాలేజిల్లో, ముఖ్యంగా మెడికల్, ాంజినీరింగ్ కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్‌పై స్పెషల్ డ్రైవల్‌లో భాగంగా గురువారం గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.చంద్రమౌళీశ్వరి పాల్గొని ర్యాగింగ్ పర్యవసానాల గురించి వివరించారు. విద్యార్థుల్లో ర్యాగింగ్‌పై అవగాహన ఉండాలని ర్యాగింగ్ చట్ట విరుద్దమని తెలిపారు. ర్యాగింగ్ చేస్తే కఠినమైన చర్యలు, తగిన శిక్షలు ఉంటాయని, అలాంటి శిక్షలు పడితే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమాజ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్, ప్రొఫెసర్ ప్రభాకర్, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










