Sep 30,2023 20:19

మాట్లాడుతున్న న్యాయమూర్తులు స్వాతి, స్పందన

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కాటూరి మెడికల్‌ కాలేజిలో, ఆర్‌విఆర్‌ అండ్‌ జెసి ఇంజినీరింగ్‌ కాలేజిలో శనివారం యాంటీ ర్యాగింగ్‌పై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. కాటూరి మెడికల్‌ కాలేజిలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో గుంటూరు 2వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌పై అవగాహన కలిగి ఉండాలని, ర్యాగింగ్‌ చట్ట విరుద్ధమన్నారు. ఆర్‌విఆర్‌లో జరిగిన సదస్సులో గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ స్పందన మాట్లాడుతూ ర్యాగింగ్‌ పర్యవసానాల గురించి వివరించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి కఠిన చర్యలు, శిక్షలు ఉంటాయని, అలాంటి శిక్షలు పడితే విద్యార్థులు భవిష్యత్‌ పాడవుతుందని వివరించారు. ఈవిటీజింగ్‌లకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటూరి మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ కాటూరి సుబ్బారావు, ఆర్‌విఆర్‌ ప్రిన్సిపాల్‌ కొల్లా శ్రీనివాసరావు, మాజీ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ప్యానల్‌ అడ్వకేట్‌ కట్టా కాళిదాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.