Oct 01,2023 20:23

మాట్లాడుతున్న జిల్లా నాయకుడు సురేష్‌

ప్రజాశక్తి-కందుకూరు : ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో జిల్లా ప్రచార జాత అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి జాతాను ప్రారంభించారు. ఈ జాతాలో ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా నాయకులు కె సురేష్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి జోహార్లు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్ధేశించి కె సురేష్‌ మాట్లాడారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సామాజిక భద్రత చట్టాన్ని ఏర్పాటు చేయాలని, రవాణా రంగ కార్మికులకు పిఎఫ్‌, ఈఎస్‌ఐ ఎంవి యాక్ట్‌ ప్రయోజనాలను చట్టపరిధిలోకి తీసుకొని రావాలని కోరారు. మోటర్‌ వెహికల్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ఆర్టీసీలను రక్షించాలని గణనీయంగా పెంచిన చార్జీలు తగ్గించాలని, ఉబర్‌ ఓలా రాపిడో కంపెనీలకు ప్రత్యాయంగా కేంద్ర ప్రభుత్వం వ్యాప్‌ ను అభివద్ధి చేసి నిర్వహించాలని, తదితర డిమాండ్ల సాధన కోసం జిల్లావ్యాప్తంగా ప్రచార జాత జరుగుతుందన్నారు. అక్టోబరు 6న చలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కారు స్టాండ్‌ వద్ద యూనియన్‌ నాయకులు వై హరిబాబు, జండాని ఊపి ప్రచార జాతాన్ని ప్రారంభించారు. కందుకూరు పట్టణంలో ఉన్న ఆటో స్టాండ్లు లారీ స్టాండ్లు ప్రచార జాత ఉద్దేశాన్ని జిల్లా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం వి రాజు మాట్లాడారు. అనంతరం పట్టణంలో ఉన్న ఆటో స్టాండ్‌ లందు విజయవాడలో జరిగే మహాధర్నాన్ని కార్యక్రమం ఉద్ధేశించి మాట్లాడారు. కందుకూరు పట్టణం నుండి ప్రచార జాత బయలుదేరింది. ఈ కార్యక్రమంలో టాటా మ్యాజిక్‌ జిల్లా నాయకులు కె సుధాకర్‌ ,ఎం సురేష్‌ , ఎస్కే శాన్వాస్‌ ,సుధాకర్‌ ,ఉప్పు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .సిఐటియు కందుకూరు పట్టణ ఎస్‌ఎ గౌస్‌ ఉన్నారు.