
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా జాతా రెండోరోజైన శుక్రవారం మంగళగిరిలో ప్రారంభమైంది. తాడేపల్లి, తాడేపల్లి రూరల్, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, పెదకాకానిలో జాతా పర్యటించింది. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.లక్ష్మణరావు, ఎన్.శివాజి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని, ఉద్యోగాల్లేక నిరుద్యోగులైన అనేక మంది ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వద్ద అప్పులు చేసి ఆటోలు కొనుగోలు నడుపుకుంటున్నారని అన్నారు. వీరికి ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు నిరంతరం ఈ-చలానాల పేరుతో ఆర్‌టిఒ, పోలీసు అధికా రులు భారీ మొత్తంలో ఫెనాల్టీలు విధిస్తున్నా రన్నారు. కరోనా తరువాత బాడుగల్లేక, ప్రతి నెలా కిస్తీలు కట్టలేక తీవ్ర ఇబ్బందుల్లు పడు తుంటే మరోప్రక్క పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచటం తోపాటు జిఎస్‌టి పేరుతో 18 శాతం టాక్స్ వసూలుతో రవాణా రంగాన్ని ప్రభుత్వాలు ఆదాయ వనరుగా భావించి వ్యవహరిస్తున్నాయే తప్ప మరోకటి కాదన్నారు. గ్రీన్ టాక్స్ పెంచటం, రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహ నాల చట్ట సవరణ చేస్తూ జిఒ 21 ద్వారా అన్ని రకాల ఫీజులు, ఫెనాల్టీలు పెంచటం, పొరపాటున యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే డ్రైవర్లకు జైలు శిక్ష విధించే 304(ఎ) లాంటి చట్టాలు తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టాల వల్ల ఏ ఒక్క వాహనం కూడా రోడ్లపై తిప్పే పరిస్థితి ఉండదన్నారు. జిఒ 21ను తక్షణమే రద్దు చేయాలని, పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, పట్టణ ప్రాంతాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై 6న విజయ వాడ ధర్నా చౌక్‌లో జరిగే ధర్నాలో ఆటో కార్మికు లంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమం సిఐటి యు సీనియర్ నాయకులు జెవి రాఘవులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్ చెంగయ్య, వి.దుర్గారావు, బి.వెంకటేశ్వర్లు, ఎం.శివసాంబి రెడ్డి, శ్రీనివాసరావు, శ్రీరాములు, సాంబశివ రావు, జెస్సి కొండలు, నవీన్, చిన్నారావు, షేక్ కరిముల్లా, మీరాఖాన్, జిలాని, వెంకటేశ్వర్లు, సుబాని, రమేష్, కాలేషా, ఖాసిం పాల్గొన్నారు.