Aug 16,2023 23:32

రుయా హాస్టల్లో భద్రత పెంచుతాం : సూపరింటెండెంట్‌
తిరుపతి సిటీ : రుయా ఆసుపత్రి ప్రాంగణంలోనే హాస్టల్స్‌ వద్ద భద్రత మరింత పెంచి తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవి ప్రభు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం జరిగిన ఘటనలో ఓ విద్యార్థి మద్యం మత్తులో సీనియర్లపై దాడి చేశారన్నారు. 2019 బ్యాచ్‌ స్టూడెంట్‌ గణేష్‌ 2018 సీనియర్‌ విద్యార్థులపై దాడి చేశాడన్నారు. నిందితుడు గణేష్‌ ఆల్కహాల్‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది. వైద్య పరీక్షలో భాగంగా నార్కోటిక్‌ ఎనాలసిస్‌ టెస్ట్‌ చేస్తున్నామని తెలిపారు. గాయపడిన ప్రవీణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడ గా ఉందని తెలిపారు.