
ప్రజాశక్తి- నర్సీపట్నం:ఈ నెల 4,5,6 తేదీలలో నిర్వహించిన నేషనల్ యోగా ఆన్ లైన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడో స్థానం సాదించిన విద్యార్థి దవరసింగి ఆదిత్య రుత్విక్ ను ప్రిన్సిపాల్ సహా పలువురు అభినందించారు. నర్సీపట్నం ఎంజేపీ ఏపీ బీసీ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న దవరసింగి ఆదిత్య రుత్విక్ నేషనల్ ఆన్ లైన్ యోగా ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడో స్థానం సాధించాడు. ఈ మేరకు బుధవారం ప్రశంసాపత్రం, మెమెంటోను పాఠశాలలో ప్రిన్సిపాల్ ఎన్.వెంకటరెడ్డి , ఏపీ యోగా అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు పుల్లేటి సతీష్, ఉపమాక దేవస్థానం ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు అందజేసి రుత్విక్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీబీ పట్నం హైస్కూల్ హెచ్ ఎం అప్పారావు, పీఆర్‌టీయు జిల్లా ప్రతినిధి డీవీఎస్ రావు, చెరుకూరి వెంకటేశ్వరరావు, యోగా టీచర్ దవరసింగి రాంబాబు, నరిశే హరిప్రసాద్ పాల్గొన్నారు.