ప్రజాశక్తి-పిఎం పాలెం: విశాఖ సాగరతీరాన రుషికొండ వద్ద . వేర్వేరు ప్రదేశాల్లో యువతీ యువకుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం విశాఖ వచ్చిన నంద్యాల ప్రాంతానికి చెందిన వెంకట్‌రెడ్డి (30) శుక్రవారం రుషికొండ బీచ్‌లో శవమై తేలాడు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్న సమయంలోనే తిమ్మపురం తీరంలో విజయనగరం జిల్లా తెర్లాం ప్రాంతానికి చెందిన దివ్య (25) అనే యువతి మృతదేహం ఒడ్డుకు చేరింది. రుషికొండ వద్ద హాస్టల్‌లోఉంటూ, సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న ఆమె కూడా శవమై తేలింది. ఒకేసారి ఈ రెండు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? లేక వేర్వేరుగానే మృతి చెందారా? వీరి మరణానికి కారణమేమై ఉంటుందన్న కోణంలో పిఎం పాలెం పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను కెజిహెచ్‌కు పోస్టుమార్టానికి తరలించారు.










